మిథునం
ముఖ్య కార్యాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు.
ఆత్మీయులు, బం«ధువులతో ఉత్సాహంగా గడుపుతారు.
ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.
స్నేహితులతో మంచీచెడ్డా విచారిస్తారు.
కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి.
కుటుంబ సభ్యుల వైఖరి మొదట్లో ఇబ్బంది కలిగించినా క్రమేపీ ప్రేమానురాగాలు పొందుతారు.
సమాజంలో మీకంటూ గుర్తింపు పొందుతారు.
అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి.
బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి.
ఒక ఆహ్వానం మరింత సంతోషం కలిగిస్తుంది.
నూతన వ్యక్తుల పరిచయం.
శుభకార్యాల నిర్వహణరీత్యా ఖర్చులు.
ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.
వాహనాలు, భూములు కొనుగోలు చేసుకుంటారు.
చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి.
పలుకుబడి మరింత పెరుగుతుంది.
వ్యాపారస్తులు కోరుకున్న లాభాలు పొంది ఉత్సాహంగా గడుపుతారు.
ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు రావచ్చు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు.
పరిశోధకులు, శాస్త్రవేత్తలు గౌరవ పురస్కారాలు అందుకుంటారు.
వారాంతంలో వృథా ఖర్చులు.
బంధువులతో వివాదాలు.