సింహం
కొన్ని కార్యక్రమాలలో వెనుకడుగు వేయక తప్పదు.
కొన్ని విషయాలలో మాటపడాల్సివస్తుంది.
ఆదాయం విషయంలో కొంత నిరుత్సాహం.
రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు.
ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి.
బంధువులు, స్నేహితులతో విభేదాలు నెలకొంటాయి.
కాంట్రాక్టర్లు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు.
నిరుద్యోగులకు గందరగోళం.
కష్టించినా ఆశించిన ఫలితం కనిపించదు.
దేవాలయ దర్శనాలు.
వ్యాపారులకు విస్తరణ యత్నాలు నిదానిస్తాయి.
ఉద్యోగుల శ్రమ ఫలించదు.
రాజకీయవేత్తలు మరింత ఓర్పుతో వ్యవహరించాలి.
కళాకారులు, క్రీడాకారులకు అంచనాలలో పొరపాట్లు.
వారాంతంలో సోదరులతో ఆనందంగా గడుపుతారు.
వస్తు లాభాలు. ఆహ్వానాలు అందుతాయి.