కన్య
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు దక్కి నిరుద్యోగులు ఉత్సాహంగా గడుపుతారు.
ఆదాయం మరింత పెరుగుతుంది.
దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు.
అలాగే, ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది.
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
మీ ఆశయాలు, లక్ష్యాలు సాధించడంలో కుటుంబ సభ్యులు మరింత సహకరిస్తారు.
చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.
మీలో దాగిన ప్రతిభ గుర్తింపులోకి వస్తుంది.
ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు.
ధార్మిక కార్యక్రమాలను చేపడతారు.
అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు.
స్వల్ప ఆరోగ్యసమస్యలు ఎదురైనా తక్షణ ఉపశమనం పొందుతారు.
వ్యాపారులకు మరింత లాభాలు దక్కే అవకాశం.
ఉద్యోగులు ప్రతిభాపాటవాలు నిరూపించుకుంటారు.
రాజకీయవేత్తలు, కళాకారులకు విశేష ఆదరణ లభిస్తుంది.
పరిశోధకులు గుర్తింపు పొందుతారు.
వారారంభంలో వృథా ఖర్చులు.
మానసిక ఆందోళన.