వృషభం
చిత్రవిచిత్ర సంఘటనలు ఆకట్టుకుంటాయి.
ఆదాయం మరింత పెరుగుతుంది.
సన్నిహితులు, స్నేహితులతో ఆనందాన్ని పంచుకుంటారు.
అదనపు ఆదాయం సమకూరి అప్పులు తీరతాయి.
ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.
సోదరులతో వివాదాలు పరిష్కారమై సఖ్యత నెలకొంటుంది.
ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.
కాంట్రాక్టర్లు అనుకున్నది సాధిస్తారు.
విద్యార్థులకు అనుకూల ఫలితాలు సాధిస్తారు.
వాహన, కుటుంబసౌఖ్యం.
కొన్ని నిర్ణయాలు కుటుంబ సభ్యులను సైతం ఆకట్టుకుంటాయి
వ్యాపారస్తులు మరింతగా లాభాలు గడిస్తారు.
ఉద్యోగులకు ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు రావచ్చు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు.
రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులు విదేశీ పర్యటనలు జరుపుతారు.
వారాంతంలో వ్యయప్రయాసలు.
బంధువులతో స్వల్ప వివాదాలు.