కర్కాటకం
ముఖ్యమైన కార్యాలలో అవాంతరాలు తొలగుతాయి.
ఆత్మీయులు, బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.
ఆదాయం సంతృప్తినిస్తుంది.
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
సమాజంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు.
బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది.
కొత్త కాంట్రాక్టులు సైతం దక్కించుకుంటారు.
ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు.
ఒక వ్యక్తి మీ అభివృద్ధిలో పాలుపంచుకోవడం విశేషం.
చిన్ననాటి స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.
గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు.
మీ అభిమానం, ఆప్యాయతలను పొందేందుకు ఆప్తులు తాపత్రయపడతారు.
వ్యాపారస్తులు లాభాలు దక్కించుకుని ఉత్సాహంగా గడుపుతారు.
ఉద్యోగులకు ఉన్నతశ్రేణి పోస్టు దక్కవచ్చు.
రాజకీయవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు.
పరిశోధకులు తమ సత్తా చాటుకుని గుర్తింపు పొందుతారు.
వారం మధ్యలో దుబారా వ్యయం. శారీరక రుగ్మతలు.