మేషం
మీ త్యాగశీలత, నేర్పరితనం అందర్నీ ఆకర్షిస్తాయి.
మీ పట్ల విధేయత మరింత పెరుగుతుంది.
మోసగించాలనుకున్న వారే పరివర్తన చెంది సహాయపడతారు.
వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు.
ఆత్మీయులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
నూతన గృహయోగం.
విద్యార్థులు ఆశించిన ఫలితాలు దక్కించుకుంటారు.
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
పలుకుబడి కలిగిన వారి పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.
మీపై వచ్చిన అపనిందలు తొలగి ఊరట చెందుతారు.
ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.
వ్యాపారులకు భాగస్వాముల నుంచి సమస్యలు తీరతాయి.
లాభాలు కూడా దక్కించుకుంటారు.
ఉద్యోగులకు విశేష కీర్తి దక్కుతుంది.
పారిశ్రామికవేత్తలు,కళాకారులకు మరింత సానుకూలమైన సమయం.
క్రీడాకారులు, వ్యవసాయదారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.
వారారంభంలో వృథా ఖర్చులు. మానసిక ఆందోళన.