మీనం...
-----
ముఖ్య కార్యాలు కొన్ని నిదానంగా సాగుతాయి. ఆదాయంలోకొంత పెరుగుదల కనిపిస్తుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొంతమేరకు పరిష్కారమవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. స్నేహితులు, బంధువుల ఆదరణ చూరగొంటారు. చాకచక్యం, ఓర్పుతో ముందుకు సాగి శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. విద్యావకాశాలు దక్కే ఛాన్స్. మీ నిర్ణయాలు సమయోచితంగా ఉంటాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగులు మంచి గుర్తింపు పొందుతారు. అలాగే, ప్రమోషన్లు కూడా దక్కవచ్చు. రాజకీయవేత్తల యత్నాలు సఫలం. కళాకారులకు సత్కారాలు, అవార్డుల ప్రదానాలు ఉంటాయి. వారాంతంలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు.