కుంభం
కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక మనస్తాపం చెందుతారు.
సోదరులు, స్నేహితులు మీ పట్ల కొంత వ్యతిరేకత చూపుతారు.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.
ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి.
ఆలోచనలు పదేపదే మార్చుకుంటారు.
దేవాలయాలు సందర్శిస్తారు.
విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి.
ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.
వ్యాపారులకు ఒడిదుడుకులు, వివాదాలు ఎదురుకావచ్చు.
ఉద్యోగులకు మరింత పనిభారం పెరుగుతుంది.
పారిశ్రామికవేత్తలు కొంత శ్రమానంతరం ఫలితం పొందుతారు.
కళాకారులు, క్రీడాకారులకు కొంత అనుకూల స్థితి.
వారారంభంలో ధన, వస్తు లాభాలు. నూతన పరిచయాలు.