వృశ్చికం
కుటుంబ సమస్యలు, ఒత్తిడులతో గడుపుతారు.
అయినా ముందుకు సాగడమే లక్ష్యంగా పెట్టుకుంటారు.
ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
స్నేహితుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతాయి.
కార్యక్రమాలలో ప్రతిబంధకాలను అధిగమించేందుకు మరింతగా శ్రమిస్తారు.
దేవాలయాలు సందర్శిస్తారు. సోదరులతో వివాదాలు.
వ్యాపారులకు కొన్ని చిక్కులు ఎదురవుతాయి.
ఉద్యోగులకు నిరుత్సాహమే.
రాజకీయవేత్తలు నిర్ణయాలలో తొందరపడరాదు.
కళాకారులు, క్రీడాకారులకు కొంత విరామం తప్పకపోవచ్చు.
వారం మధ్యలో కీలక విషయాలు తెలుస్తాయి.
పరిచయాలు పెరుగుతాయి.