తుల
పనిఒత్తిడుల నుంచి విముక్తి. నూతన విద్యావకాశాలు పొందుతారు.
బంధుమిత్రులు, ఇరుగుపొరుగుతో వివాదాలు తీరతాయి.
ఇంట్లో శుభపరిణామాలు ఉత్సాహాన్నిస్తాయి.
నేర్పు, ఓర్పుతో కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు.
రాబడి పెరిగి సంతోషంగా గడుపుతారు.
శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి.
వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు.
కొన్ని సంఘాలు, పార్టీలలో సభ్యత్వాలు స్వీకరిస్తారు.
సంతానరీత్యా శుభవార్తలు వింటారు.
విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు.
రావలసిన కొన్ని బాకీలు అందుతాయి.
కొత్త అగ్రిమెంట్లు సైతం చేసుకుంటారు.
కోర్టు వ్యవహారాలలో కొంత ఊరట లభిస్తుంది.
వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు.
ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి.
రాజకీయవేత్తలు, కళాకారులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరే సమయం.
వారారంభంలో ఖర్చులు. శ్రమాధిక్యం.