ధనుస్సు
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
ఆలోచనలు అమలులో పెడతారు.
సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది.
చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.
దైవకార్యాలలో పాల్గొంటారు.
రావలసిన సొమ్ము కూడా అందుతుంది.
బంధువుల నుంచి ధనలాభ సూచనలు.
కుటుంబంలో శుభకార్యాల నిర్వహణతో ఉత్సాహంగా గడుపుతారు.
శారీరక రుగ్మతల నుంచి బయటపడతారు.
వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం కాగలవు.
ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉండవచ్చు.
పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి.
పరిశోధకులు, వ్యవసాయదారులు మునుపటి కంటే ఉత్సాహంగా సాగుతారు.
వారం మధ్యలో వృథా ఖర్చులు. మానసిక ఆందోళన.