కన్య
కీలక నిర్ణయాలకు తగిన సమయమే.
ముఖ్య కార్యక్రమాలను అనూహ్యమైన రీతిలో పూర్తి చేస్తారు.
అందరిలోనూ కీర్తిప్రతిష్ఠలు దక్కుతాయి.
మీ సత్తా చాటుకుంటారు.
కుటుంబ సభ్యులు సైతం మీ పై ప్రేమానురాగాలు చూపుతారు.
ఆస్తుల వ్యవహారంలో నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు.
వాహనయోగం. ఇతరులకు చేయూతనందించి దానగుణాన్ని చాటుకుంటారు.
విద్య, ఉద్యోగావకాశాలు దక్కే ఛాన్స్.
నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.
ఆరోగ్యపరంగా చికాకులు ఎదురైనా క్రమేపీ ఉపశమనం పొందుతారు.
అదనపు ఆదాయం సైతం దక్కుతుంది.
విమర్శించిన వ్యక్తులే ప్రశంసిస్తారు.
దూర ప్రయాణాలు చేస్తారు.
వ్యాపారులకు లాభాలు మరింత ఊరటనిస్తాయి.
భాగస్వాములు కూడా మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు.
ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సత్కారాలు.
క్రీడాకారులు, మీడియా రంగం వారు ప్రతిభను నిరూపించుకుంటారు.
వారాంతంలో కుటుంబ సభ్యులతో విభేదాలు. ధననష్టం.