మేషం
ముఖ్య కార్యాలు విజయవంతంగా సాగుతాయి.
ఆదాయం ఆశాజనకంగా ఉండి అవసరాలు తీరతాయి.
కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కుతారు.
అందరిలోనూ మీ ప్రతిభను చాటుకుంటారు.
ముఖ్య నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సూచనలు పాటిస్తారు.
జీవిత భాగస్వామితో వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు.
స్నేహాలు విస్తరిస్తాయి.
శత్రువులు కూడా మీ పట్ల ప్రేమ చూపుతారు.
వ్యాపారులకు పెట్టుబడులకు తగినంతగా లాభాలు దక్కుతాయి.
ఉద్యోగులకు విధుల్లో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు కొత్త సంస్థల ఏర్పాటు పై తుది ఒప్పందాలు చేసుకుంటారు.
రాజకీయవేత్తలకు అంచనాలు నిజం చేసుకుంటారు.
పరిశోధకులు, కళాకారులు సన్మానాలతో ముందడుగు వేస్తారు.
వారాంతంలో దుబారా ఖర్చులు.
శారీరక రుగ్మతలు. బంధువిరోధాలు.