కర్కాటకం
ఉద్యోగ ప్రయత్నాలలో ఊహించని ప్రగతి.
కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ పై మరింత దృష్టి పెడతారు.
కార్యక్రమాలు అనుకున్న విధంగా నెరవేరతాయి.
మిత్రుల సాయంతో కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు.
ధార్మిక సమావేశాల్లో పాల్గొంటారు.
కుటుంబసభ్యులసూచనలు, సలహాలు స్వీకరిస్తారు.
ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడంలో విజయం సాధిస్తారు.
కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు.
వ్యాపారులు, వాణిజ్యవేత్తల ఆలోచనలు కలసివస్తాయి.
ఉద్యోగులకు నూతనోత్సాహం, ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితి.
చిత్రపరిశ్రమ, రాజకీయవేత్తల కృషి ఫలించే సమయం.
విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.
మహిళలు మనో వికాసంలో ముందుకు సాగుతారు.
అనుకూల రంగులు.... ఎరుపు, పసుపు.
ప్రతికూల రంగు...గులాబీ.
సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.