కర్కాటకం
కొన్ని వివాదాలు నెలకొన్నా నేర్పుగా పరిష్కరించకుంటారు.
ఆస్తుల వ్యవహారాలలో మధ్యవర్తిత్వం వహిస్తారు.
ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి చేయకుండా విశ్రమించరు.
దూరపు బంధువులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు.
ఇంట్లో వేడుకల నిర్వహణతో హడావిడిగా గడుపుతారు.
ఆపదలో ఉన్న వారికి స్నేహహస్తం అందిస్తారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
అనుకోని ఒక వ్యక్తి మీకు సహాయం అందిస్తారు.
స్థిరాస్తి కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి.
పలుకుబడి మరింత పెరుగుతుంది.
సమాజ సేవలో భాగస్వాములవుతారు.
వ్యాపారస్తులకు ఊహించని లాభాలు.
ఉద్యోగులు విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు మరింత ఆశాజనకంగా ఉంటుంది.
వారారంభంలో ప్రయాణాలలో మార్పులు.
శారీరక రుగ్మతలు.