సింహం
మీ మాటను ఎవరూ కాదనలేని పరిస్థితి .
సోదరులతో విభేదాలు సర్దుబాటు చేసుకుంటారు..
శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు.
మీరు ఆశించినరీతిలో ధనం సమకూరుతుంది.
వాహనాలు, విలువైన వస్తువులు కొంటారు.
స్థిరాస్తులు సమకూర్చుకోవడంలో ప్రతిబంధకాలు తొలగుతాయి.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు ఊహించని అభివృద్ధి కనిపిస్తుంది.
ఉద్యోగులకు వివాదాలు సర్దుబాటు కాగలవు..
రాజకీయవేత్తలు, క్రీడాకారులకు కీలక సందేశం రాగలదు.
విద్యార్థులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు.
మహిళలకు కుటుంబసమస్యల పరిష్కారం.
అనుకూల రంగులు.... గులాబీ, ఆకుపచ్చ.
ప్రతికూల రంగు...ఎరుపు.
గణేశ్ స్తోత్రాల పఠనం మీలో శ్రద్ధాసక్తులు పెంచుతుంది.