సింహం
స్నేహితులు, శ్రేయోభిలాషులతో ఉత్సాహంగా గడుపుతారు.
అనుతున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి.
దీర్ఘకాలిక రుణబాధల నుంచి విముక్తి.
కొత్త కార్యాలు చేపట్టి విజయవంతంగా సాగుతాయి.
ఉద్యోగార్థులు అనుకున్న ఉద్యోగాలు సాధిస్తారు.
అంచనాలు నిజమవుతాయి.
కుటుంబంలో మీ మాటకు ఎదురుండదు.
దేవాలయాలు సందర్శిస్తారు.
వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి.
సోదరులు,సోదరీలతో విభేదాలు పరిష్కారం.
వ్యాపారులు కొత్త పెట్టుబడులు సమకూర్చుకుని లాభాలు ఆర్జిస్తారు.
ఉద్యోగులకు పదోన్నతులు.
రాజకీయవర్గాలకు పదవీయోగం.
క్రీడాకారులు, కళాకారులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి.
వారారంభంలో భూ వివాదాలు. ధన నష్టం.