తుల
సకాలంలో చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు.
సోదరుల నుంచి ధన,వస్తు లాభాలు కలుగుతాయి.
ఆరోగ్యంపై కొంత కొంత శ్రద్ధ వహించండి.
సేవాకార్యక్రమాల పై ఆసక్తి చూపుతారు.
స్థిరాస్తి వివాదాలు తీరతాయి.
తీర్థ యాత్రలు చేస్తారు.
పట్టుదల, నేర్పుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.
అదనపు రాబడితో ఉత్సాహంగా గడుపుతారు.
పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు.
ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు దక్కుతాయి.
వ్యాపారులు మరింతగా లాభాలు పొందుతారు.
పారిశ్రామికవేత్తలకు వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి.
రాజకీయవేత్తలు విదేశీ పర్యటనలు చేస్తారు.
కళాకారులు, పరిశోధకులు సత్తా చాటుకుంటారు.
వారారంభంలో వృథా ఖర్చులు.
మానసిక ఆందోళన.