మీనం
సకాలంలో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు.
సమాజంలో కీర్తి దక్కుతుంది.
ఒక సమాచారం మీ ఆశలు నిజం చేస్తుంది.
మీ కృషి, పట్టుదల చూసి కుటుంబ సభ్యులు సైతం ఆశ్చర్యపోతారు.
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.
వ్యాపారులు, వాణిజ్యవేత్తలకు మరింత సంతోషదాయకంగా ఉంటుంది.
ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
పారిశ్రామిక, రాజకీయవేత్తలు విదేశీ పర్యటనలకు బయలుదేరవచ్చు.
విద్యార్థులకు ఫలితాలపై సంతృప్తి.
మహిళలకు శుభవర్తమానాలు.
అనుకూల రంగులు...... గులాబీ, బంగారు.
ప్రతికూల రంగు.. ఆకుపచ్చ.
సత్యనారాయణస్వామిని పూజించాలి.