మీనం
చేపట్టిన కార్యాలు సాఫీగా సాగుతాయి.
ఇంటాబయటా గౌరవమర్యాదలు మరింత పొందుతారు.
అనుకున్న ఆదాయం సమకూరుతుంది.
ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.
నిరుద్యోగులకు అనుకోని ఉద్యోగలాభం.
ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి సాధిస్తారు.
దీర్ఘకాలిక వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.
శారీరక రుగ్మతల నుంచి బయటపడతారు.
వాహనాల విషయంలో కొంత అప్రమత్తత అవసరం.
వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి.
ఉద్యోగులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది.
క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు అనుకోని ఆహ్వానాలు రాగలవు.
క్రీడాకారులకు విశేషంగా కలసి వస్తుంది, నైపుణ్యం వెలుగులోకి వస్తుంది.
కళాకారులు పట్టుదలతో అవకాశాలు సాధిస్తారు.
వారాంతంలో బంధువిరోధాలు.
కష్టమే తప్పితే ఫలితం కనిపించదు. మానసిక అశాంతి.