ధనుస్సు.
కుటుంబంలో అనుకూల వాతావరణం.
ఆర్థికంగా గతం కంటే మరింత మెరుగైన పరిస్థితిని చూస్తారు.
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
శుభకార్యాల నిర్వహణలో ముందడుగు వేస్తారు.
కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు.
ఆలయాలు సందర్శిస్తారు.
ముఖ్య విషయాలపై కుటుంబ సభ్యులతో సంప్రదిస్తారు.
ఇంటి నిర్మాణాల పై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలకు మరింత లాభసాటిగా ఉంటుంది..
ఉద్యోగులు అప్పగించిన బాధ్యతలు సమర్థనీయంగా చేస్తారు.
పారిశ్రామిక,రాజకీయవేత్తలకు ఒక పిలుపు ఊరటనిస్తుంది.
విద్యార్థులు కొత్త విద్యావకాశాలు దక్కించుకుంటారు.
మహిళలకు విశేష గౌరవం దక్కుతుంది.
అనుకూల రంగులు....... కాఫీ,బంగారు.
ప్రతికూల రంగు...తెలుపు.
గణపతిని అర్చనలు ఈతి బాధలు తొలగిస్తాయి.