వృషభం
కార్యక్రమాలను పూర్తి చేస్తారు.
పాత మిత్రులను కలుసుకుని మీ మనోభావాలను పంచుకుంటారు.
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సఫలం.
సమాజసేవలో భాగస్వాములవుతారు.
మీకీర్తి మరింత విస్తరిస్తుంది.
కొత్త వ్యక్తులు పరిచయం ఉత్సాహాన్నిస్తుంది.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు మరింత ప్రోత్సాహం..
ఉద్యోగులకు ఆశించిన మేర హోదాలు రాగలవు.
పారిశ్రామిక, రాజకీయవేత్తలు ఇంతకాలం పడిన ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు.
విద్యార్థులకు అంచనాలు ఫలిస్తాయి.
మహిళలు సోదరుల నిర్ణయాలతో ఏకీభవిస్తారు.
అనుకూల రంగులు.... పసుపు, గులాబీ.
ప్రతికూల రంగు...నేరేడు.
కనకదుర్గా దేవి స్తోతాలు పఠిస్తే భయాందోనలు, ఒత్తిడులు తొలగుతాయి.