కన్య
ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన సమయం.
రాబడి ఉన్నా ఖర్చులు కూడా వాటికి సమానంగా ఉంటాయి.
మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు.
కుటుంబ బాధ్యతలతో కొంత అసహనానికి లోనవుతారు.
ఆలోచనలు పరిపరివిధాలుగా ఉండి ఎటూ తోచనిస్థితి.
ఆరోగ్యపరమైన సమస్యలతో కొంత కుస్తీపడతారు.
ఇంటి నిర్మాణంలో కొన్ని ప్రతిబంధకాలతో నిలిపివేస్తారు.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లేనిపోని సమస్యలు.
ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు.
కళాకారులు, శాస్త్రవేత్తలు మరింత మనోధైర్యంతో ముందుకు సాగాలి.
విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి.
మహిళలకు మనశ్శాంతి కరవై ఇబ్బంది పడతారు.
అనుకూల రంగులు.... కాఫీ, తెలుపు.
ప్రతికూల రంగు.నలుపు..
శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.