కర్కాటకం
కొత్తగా చేపట్టిన కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోతాయి.
విద్యార్థులు మరిన్ని∙విజయాలు సాధిస్తారు.
అనుకున్న విధంగా ప్రయాణాలు సాగించి ముఖ్యులను కలుసుకుంటారు..
చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.
చిరకాలంగా ఎదురవుతూ వస్తున్న ఒక సమస్య నుండి గట్టెక్కుతారు.
ఆలోచనలు కార్యాచరణ దాలుస్తాయి.
విద్యార్థులకు అనుకూల సమాచారం.
రావలసిన సొమ్ము అంది కొన్ని అవసరాలు తీరతాయి.
అలాగే, పొదుపు పథకాలలో పెట్టుబడులు పెడతారు..
ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు అదిగమించి ఒక అంగీకారానికి వస్తారు.
విలువైన ఆభరణాలు సమకూర్చుకుంటారు.
కుటుంబంలోని అందరి ప్రేమ, ఆదరణ పొందుతారు.
భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదాలు తీరతాయి.
మీ మాటను సోదరులు సైతం కాదనలేరు.
ఆస్తుల పంపకాలలో వివాదాలను స్వయంగా పరిష్కరిస్తారు.
వ్యాపారాలలో కొత్త పెట్టుబడులతో ముందడుగు వేస్తారు.
తగినంత లాభాలు దక్కుతాయి.
అలాగే, భాగస్వాముల అభిప్రాయాల మేరకు నడుచుకుంటూ విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు.
ఉద్యోగాలలో మరింత గుర్తింపు లభిస్తుంది.
మీ సామర్ధ్యాన్ని పైస్థాయి వారు గుర్తిస్తారు.
కొన్ని సందర్భాలలో ఇతరుల బాధ్యతలు కూడా మోస్తారు.
పారిశ్రామికవేత్తలు, వైద్యులు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.
వీరు అనుకున్నది అనుకున్నట్లే జరుగుతుంది.
టెక్నికల్ రంగం వారికి ప్రోత్సాహంతో పాటు గుర్తింపు లభిస్తుంది.
మహిళల సలహాలు కుటుంబంలోని వారు పాటిస్తారు.
అయితే వీరు సోమ, మంగళ, బుధవారాలు కొంత అప్రమత్తంగా ఉండడం మంచిది.
ముఖ్యంగా ప్రయాణాలు, ఆరోగ్యం విషయం లో.
ఇక ఆర్థికంగా బాగున్నా ఖర్చులు తగ్గించుకుంటే మేలు.
వ్యాపార, ఉద్యోగాలలో కొంత పరీక్షాసమయం.
దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.