వృశ్చికం
వీరికి క్రమేపీ అనుకూలమైన వాతావరణం నెలకొంటుది.
ఆర్థిక విషయాలపై సంతృప్తి చెందుతారు. ఏ ఖర్చు ఎదురైనా తట్టుకుని నిలబడతారు.
బంధువులు, స్నేహితులతో మనస్పర్థలు తొలగుతాయి.
భవిష్యత్తుపై కొంత భరోసా ఏర్పడుతుంది.
కష్టాలు, సమస్యల నుండి బయపడేందుకు మార్గం దొరుకుతుంది.
పట్టుదలతో అనుకున్న కార్యాలు పూర్తి చేస్తారు.
తల్లి తరఫు వారి నుంచి ఊహించని విధంగా సాయం అందుకుంటారు.
ఆస్తుల వ్యవహారంలో సమస్యలు ఎదురైనా సర్దుబాటు చేసుకుంటారు.
ఇంటి నిర్మాణాలలో వేగం పెంచుతారు.
విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమ ఫలించవచ్చు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి.
సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు.
వృత్తులు, వ్యాపారాలలో కొన్ని చిక్కులు ఎదురైనా అధిగమిస్తారు.
ముఖ్యంగా ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటుంది.
రాజకీయవేత్తలు, కళాకారులకు అంచనాలు నెరవేరతాయి.
క్రీడాకారులు, ఐటీ రంగం వారికి సరైన గుర్తింపు లభిస్తుంది.
మహిళల యత్నాలు సఫలీకృతమవుతాయి.
వారం చివరిలో రుణఒత్తిడులు. బాధ్యతలు మీదపడతాయి.
నమ్మిన వ్యక్తలే మోసగించే వీలుంది.
అనూరాధ నక్షత్రం వారు ప్రతి విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలి.
తొందరపాటు చర్యలు వద్దు.
దక్షిణామూర్తిని పూజిస్తే మంచిది.