తుల
వీరికి అన్నీ శుభసూచకాలే కనిపిస్తాయి.
ఆదాయం మరింత ఆశాజనకంగా ఉంటుంది.
చిరకాలంగా శత్రువులుగా భావిస్తున్న వారు కూడా స్నేహహస్తం అందిస్తారు.
భార్యాభర్తల వివాదాలు తొలగి ఉత్సాహంగా ఉంటారు.
విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.
దూరపు బంధువులను కలుసుకుని కీలక అంశాలపై చర్చిస్తారు.
ఏ కార్యక్రమమైనా పూర్తి చేసే వరకూ విశ్రమించరు.
ఆలయాలు సందర్శిస్తారు.
కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకలకు సిద్ధమవుతారు.
కొత్త కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు.
స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి.
వాహన, గృహయోగాలు కలుగుతాయి.
సంతానపరంగా శుభవర్తమానాలు అందుతాయి.
మీ నిర్ణయాలపై సర్వత్రా ఆమోదం వ్యక్తమవుతుంది.
కొన్ని ప్రధాన సమస్యల నుంచి బయటపడతారు.
వృత్తులు, వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి.
ముఖ్యంగా వ్యాపారాలు మరింత పుంజుకుని ఉత్సాహాన్నిస్తాయి.
రాజకీయవేత్తలు, కళాకారులు, వ్యవసాయదారులకు
ఐటీ రంగం, పారిశ్రామికవేత్తలు పట్టుదలతో విజయం సాధిస్తారు.
మహిళల ఆశలు నెరవేరే రోజులు.
వారం చివరిలో కాస్త ఒడిదుడుకులు.
ధన వ్యయం. మనస్సు చంచలంగా ఉంటుంది.
ఆరోగ్యం సహకరించక ఇబ్బందిపడతారు.
ముఖ్యంగా చిత్త నక్షత్రం వారు జాగ్రత్తలు పాటించాలి.
శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠిస్తే మేలు.