వృషభం
భవిష్యత్తు బంగారుమయంగా కనిపిస్తుంది.
ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే.
ఆప్తులతో వివాదాలు క్రమేపీ సర్దుకుంటాయి.
మీ ఆలోచనలకు అందరితోనూ పంచుకుంటారు.
వివాహాది వేడుకలు నిర్వహిస్తారు.
బంధువర్గంతో ఉత్సాహవంతంగా గడుపుతారు.
సమస్యల వలయం నుంచి క్రమేపీ గట్టెక్కుతారు.
పెద్దల సలహాలు స్వీకరిస్తారు.
మీకు నచ్చిందే చేస్తారు, ఎవరి మాట లెక్కచేయరు.
ప్రముఖులు పరిచయమవుతారు.
కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.
ఒక సమాచారం ఆకట్టుకుంటుంది.
స్థిరాస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.
వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.
ఆరోగ్యం కొంత చికాకు పరుస్తాయి.
అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి.
వృత్తులు, వ్యాపారాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి.
ఉద్యోగాలలో కొంతకాలంగా పడుతున్న ఇబ్బందులు తొలగుతాయి.
రాజకీయవేత్తలు, కళాకారులు సమర్థత, సత్తా చాటుకుంటారు.
పారిశ్రామికవేత్తలు, వైద్యరంగం వారికి అన్నింటా విజయాలే.
మహిళలకు సమస్యలు తీరే సమయం.
వారం ప్రారంభంలో దూర ప్రయాణాలు.
వ్యయప్రయాసలు. బంధువర్గం నుండి సమస్యలు.
స్వల్ప రుగ్మతలు.
మృగశిర కాస్త నిదానం పాటించడం అవసరం.