కన్య
ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయాలన్న పట్టుదల పెరుగుతుంది.
బంధువర్గం, భార్యాభర్త మధ్య వివాదాలు పరిష్కారమవుతాయి.
చిన్ననాటి మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు.
స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు.
వివాహాది వేడుకలకు ఘనంగా నిర్వహిస్తారు.
ఆశించినంత ఆదాయం సమకూరి అవసరాలకు ఆదుకుంటుంది.
సోదరులు,సోదరీలతో మరింత సఖ్యత నెలకొంటుంది.
ఒక సంఘటన మీలో మార్పునకు కారణ మవుతుంది.
వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
కొత్త కాంట్రాక్టులు దక్కించుకుని లబ్ధి పొందుతారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
విద్యార్థులు, నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు దక్కవచ్చు.
వృత్తులు, వ్యాపారాలు మెరుగ్గానే ఉంటుంది.
రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.
క్రీడాకారులు, ఐటీ రంగం వారి ఆశలు ఫలించే సమయం.
మహిళలకు మానసిక ప్రశాంతత.
వారం చివరిలో దూరప్రయాణాలు. ఎంత కష్టించినా ఫలితం కానరాదు.
ఆరోగ్య సమస్యలు.
ఉత్తర నక్షత్రం వారు ప్రయాణాలు విరమించడం ఉత్తమం.
విరోధాలు పెట్టుకోవద్దు.
నవగ్రహ స్తోత్రాలు పఠించండి.