మీనం
ఈవారం అన్నింటా విజయకేతనం ఎగురవేస్తారు.
ఆర్థికంగా ఇబ్బందులను అధిగమించి కొంత పొదుపు చేస్తారు.
అనుకున్న కార్యక్రమాలలో ప్రతిష్ఠంభన తొలగి వేగం పుంజుకుంటాయి.
సోదరులు, సోదరీలతో మనస్పర్థలు తీరతాయి.
కొత్త కాంట్రాక్టులు కొన్ని ఎట్టకేలకు సాధిస్తారు.
బంధువులు, మిత్రుల సహాయసహకారాలు అందుతాయి.
ఒక సంఘటన మీ మనస్సును ఆకట్టుకుంటుంది.
మీ సేవా కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకుంటాయి.
కొత్త విషయాలు తెలుసుకుంటారు.
భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.
నిరుద్యోగుల ఉద్యోగావకాశాలు రావచ్చు.
వివాహాది వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.
ఊహించని ఆహ్వానాలు ఉత్సాహాన్నిస్తాయి.
వృత్తులు, వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.
ముఖ్యంగా వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కళాకారులు, పారిశ్రామికవేత్తలకు శుభసందేశాలు అందుతాయి.
ఐటీ రంగం వారు, వ్యవసాయదారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.
మహిళల కలలు నెరవేరతాయి.
వారం మధ్యలో ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు.
దూర ప్రయాణాలు ఉంటాయి.
కొన్ని ఒత్తిడులతో సతమతం కాగలరు.
రేవతి నక్షత్రం వారు అన్నింటా అప్రత్తులై మెలగాలి.
విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.