సింహం
మీ అంచనాలు తప్పవచ్చు.
మంచికి వెళితే చెడుగా మారి ఇబ్బంది పడతారు.
శారీరక రుగ్మతలు బాధిస్తాయి.
ఆదాయం, వ్యయాలు సమానస్థాయిలో ఉంటాయి.
భవిష్యత్తు గురించి ఆలోచన విరమించడం మంచిది.
బంధువులతో అకారణంగా వివాదాలు నెలకొని కలత చెందుతారు.
పరిస్థితులు అంతగా అనుకూలించవు.
ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు సాగదు.
కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
శత్రువులు మరిన్ని ఇబ్బందులు కల్పించవచ్చు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
సన్నిహితులు, స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు.
వాహనాలు, ఇళ్ల కొనుగోలు ప్రయత్నాలు నిదానిస్తాయి.
విద్యార్థులు మరింత శ్రమిస్తే ఫలితం దక్కుతుంది.
వాహనాలు విషయంలో అప్రమత్తంగా మెలగండి.
వృత్తులు, వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి.
ముఖ్యంగా వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
రాజకీయవేత్తలు, కళాకారులకు అందిన అవకాశాలు కూడా నిరాశ పరుస్తాయి.
వైద్యరంగం వారు, ఐటీ రంగం వారికి ఒత్తిడులు అధికం.
గుర్తింపు అంతగా ఉండదు.
మహిళకు చికాకులు తప్పకపోవచ్చు.
వారం మధ్యలో శుభవార్తా శ్రవణం, విందువినోదాలు. కార్యజయం. వస్తులాభాలు.
మఖ నక్షత్రం వారు మాత్రం ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.
సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.