మిథునం
ముఖ్యమైన కార్యక్రమాలను కుటుంబ సభ్యుల సలహాల మేరకు పూర్తి చేస్తారు.
ఆత్మీయులు కీలక సమాచారం అందిస్తారు. దాని ద్వారా మీకు మేలు చేకూరుతుంది.
భవిష్యత్తు ప్రణాళిక పై ఒక అంచనాకు వస్తారు.
దేవాలయాలు సందర్శిస్తారు.
రాబడి ఆశాజనకంగా ఉండి. రుణబాధలు తొలగుతాయి.
ఊహించని రీతిలో తీర్థయాత్రలు చేస్తారు.
నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది.
శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది.
కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు.
అయితే ఆరోగ్యసమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి.
మనస్సులోని అభిప్రాయాలను నిర్భయంగా కుటుంబసభ్యులకు వెల్లడిస్తారు.
వాహనాలు, స్థలాలు కొంటారు.
బంధువులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు.
నిరుద్యోగులు, విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు.
వృత్తులు, వ్యాపారాలలోని వారికి యోగదాయకమైన కాలమే.
రాజకీయవేత్తలు, కళాకారులు, వ్యవసాయదారులు లక్ష్యాలు సాధిస్తారు.
ఐటీ రంగం వారికి చెప్పుకోతగిన ప్రాజెక్టులు లభిస్తాయి.
మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవం లభిస్తుంది.
వారం ప్రారంభంలో ప్రయాణాల్లో స్వల్ప ఆటంకాలు, శ్రమ పెరుగుతుంది.
మనశ్శాంతి లోపిస్తుంది.
ఆరుద్ర నక్షత్రం వారు నిదానం పాటించాలి.