కుంభం
అనుకున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి.
ఆదాయం ఆశించినతీరులో పెరుగుతుంది.
ప్రత్యర్థులు సైతం మీ పట్ల విధేయులుగా మారవచ్చు.
చిన్ననాటి మిత్రులతో నెలకొన్న విభేదాలు తొలగి ఊరట చెందుతారు.
అత్యంత కీలకమైన విషయాలు తెలుస్తాయి.
బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి.
కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు.
వాహనాలు, ఆభరణాలు కొంటారు.
ఆస్తులు విషయంలో ప్రతిష్ఠంభన తొలగుతుంది.
నిరుద్యోగులకు ఉద్యోగ ఆశలు పెరుగుతాయి.
సకాలంలో తీసుకునే నిర్ణయాలు ఎంతో ఉపయోగిస్తాయి.
చాకచక్యంగా సమస్యల నుంచి బయటపడతారు.
వృత్తులు, వ్యాపారాలు ఒత్తిడులు, సమస్యలు తీరతాయి.
ముఖ్యంగా ఉద్యోగాలలో ఉన్నత స్థితి లభిస్తుంది.
రాజకీయవేత్తలు, కళాకారులు, వ్యవసాయదారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
క్రీడాకారులు, ఐటీ రంగం వారు నైపుణ్యాన్ని చాటుకుంటారు.
మహిళలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.
వారం ప్రారంభంలో ఆరోగ్యపరంగా చికాకులు,
కుటుంబంలో ఒత్తిడులు తప్పవు.
కొన్ని వ్యవహారాలలో వెనుకడుగు తప్పవు.
శతభిషం వారు కాస్త నిదానంగా వ్యవహరించడం ఉత్తమం.
శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.