కర్కాటకం
ఎంతటి పని చేపట్టినా అలసట ఎదురైనా పూర్తి చేస్తారు.
మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది.
చిరకాల మిత్రులను కలుసుకునే సమయం.
కొన్ని వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు.
విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.
మీకు ఇతరుల ద్వారా రావలసిన సొమ్ము మొత్తానికి రాబట్టుకుంటారు.
ఇబ్పందులు తొలగుతాయి.
పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టేందుకు మార్గం ఏర్పడుతుంది.
అయితే ఆది, సోమ, మంగళవారాలు మాత్రం ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.
అలాగే, నిదానంగా వ్యవహరించాలి.
కుటుంబ సభ్యులతో మీ అభిప్రాయాలను పంచుకుంటారు.
నిర్మొహమాటంగా మనస్సులో ఉన్న విషయాలు వెల్లడిస్తారు.
కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.
సంతానరీత్యా మంచి పేరు లభిస్తుంది.
సోమ, మంగళవారాలు మాత్రం తొందరపాటు నిర్ణయాలు వద్దు.
షేర్లు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.
ఒక భూ విషయంలో సందిగ్ధత నెలకొనే సూచనలు.
వ్యాపారాలు..వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి.
మరింత విస్తరించాలన్న ఆలోచనలు భాగస్వాములతో పంచుకుంటారు.
సోమ, మంగళవారాలు లాభాలు అంతగా కనిపించవు. నిరాశ చెందవద్దు.
ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. సేవలకు తగిన గుర్తింపు రాగలదు.
సోమవారం లేదా మంగళవారం పనిఒత్తిడులు రావచ్చు.
వైద్యులు,పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
టెక్నికిల్ రంగం వారు మొదట కొంత అసంతృప్తితో ఉన్నా క్రమేపీ అనుకూలత కలుగుతుంది.
మహిళలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
టెక్నికల్ రంగం వారు అనుకున్నది సాధించాలన్న తపనతో ముందుకు సాగుతారు.
అయితే పై స్థాయి వారి నుండి సమస్యలు రావచ్చు.
విష్ణు ధ్యానం మంచిది.
బియ్యంతో చేసిన తీపి పదార్ధాన్ని నివేదించండి.