మకరం
ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి చేసేందుకు కొంత శ్రమపడాలి.
అయితే ఫలితం ఉంటుంది.
ఆస్తుల విషయంలో నెలకొన్న స్థబ్ధత తొలగుతుంది.
అందరిపైనా ప్రేమాభిమానాలు చూపుతారు.
సమాజసేవలో ప్రధాన పాత్ర పోషిస్తారు.
అందరిని ఆకట్టుకునేందుకు తాపత్రయపడతారు.
సోదరులు, సోదరీలతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.
ఆదాయం, ఖర్చులు సమస్థాయిలో ఉంటాయి.
బంధువులను హఠాత్తుగా కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.
కొత్త కాంట్రాక్టులు దక్కించుకునేందుకు యత్నాలు ముమ్మరం చేస్తారు.
విద్యార్థులు, నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి.
బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
వృత్తులు, వ్యాపారాలు క్రమేపీ పుంజుకుని అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.
రాజకీయవేత్తలు, కళాకారులకు విజయాలు వరిస్తాయి.
వైద్యరంగం, ఐటీ రంగం వారికి మరింత అనుకూలమైన కాలం.
మహిళలకు ఆనందకరంగా ఉంటుంది.
వారం ప్రారంభంలో దూర ప్రయాణాలు సంభవం.
శారీరక రుగ్మతలతో బాధపడతారు. మనస్సుకు ప్రశాంతత ఉండదు.
ధనిష్ఠ నక్షత్రం వారు మరింత శ్రమపడతారు. వీరి పై ఒత్తిడులు పడొచ్చు.
నవగ్రహ స్తోత్రాలు పఠించండి.