ధనుస్సు
అనుకున్న ఆదాయానికి లోటులేకుండా గడుస్తుంది.
కొంతకాలంగా అర్థాంతరంగా నిలిచిన పనులు సైతం పూర్తి చేస్తారు.
విద్యార్థులు, నిరుద్యోగులకు విజయాలు వరిస్తాయి.
కీలక సమావేశాలలో పాల్గొంటారు.
ప్రత్యర్థులను సైతం ప్రేమతో ఆకట్టుకుంటారు.
వ్యూహాత్మకంగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఆస్తులు వ్యవహారాలలో చికాకులు తొలగి ఒడ్డునపడతారు.
చిరకాల మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.
దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది.
కుటుంబంలో వివాహయత్నాలు కొలిక్కి వస్తాయి.
సంతానపరంగా నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి.
తెలివిగా ముఖ్య వ్యవహారాలు సైతం పూర్తి చేస్తారు.
పలుకుబడి కలిగిన వారి పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.
కొత్త కాంట్రాక్టులు ఎట్టకేలకు సాధిస్తారు.
వాహనాలు , గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి.
మీఖ్యాతి పెరుగుతుంది.
వృత్తులు, వ్యాపారాలు గతం కంటే మెరుగై లబ్ధి పొందుతారు.
ముఖ్యంగా వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి.
రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు సంభవం.
వైద్యరంగం, ఐటీ రంగం వారికి చెప్పుకోతగిన అభివృద్ధి కనిపిస్తుంది.
మహిళలకు కుటుంబ సభ్యులతో మనస్పర్థలు తీరతాయి.
వారం మధ్యలో ఆరోగ్యపరంగా చికాకులు తప్పకపోవచ్చు.
ఆలోచనలు అనేక రకాలుగా ఉండి తర్జనభర్జన పడతారు.
కుటుంబంలో ఒత్తిడులు. పూర్వాషాఢ వారు కాస్త జాగ్రత్తలు పాటిస్తే మేలు.
హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.