మకరం
కొన్ని కార్యక్రమాలు అనుకున్న కొంత నెమ్మదిగా సాగుతాయి.
ఆపదలో ఉన్న వ్యక్తులకు చేయూతనివ్వడంలో ముందుంటారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కి ఉత్సాహంగా ఉంటుంది.
ఒక సమస్య నుండి బయటపడతారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
మిత్రులు సహాయసహకారాలు అందించి తోడుగా నిలుస్తారు.
వ్యతిరేక పరిస్థితుల నుండి బయటపడతారు.
ఊహించని విధంగా ధనప్రాప్తి కలుగుతుంది.
అలాగే, పొదుపు మార్గాలు అనుసరిస్తారు.
రుణ విముక్తి సైతం లభిస్తుంది.
అందరికీ మీరంటే ఇష్టం పెరుగుతుంది.
బంధువులు రాకతో మరింత సందడి నెలకొంటుంది.
ఎవరినీ నొప్పించకుండా నిర్ణయాలు తీసుకుంటారు.
వివాహాది కార్యక్రమాల పై అందరితో చర్చిస్తారు.
భూములు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి.
ఊహించని రీతిలో ఒప్పందాలు చేసుకుంటారు.
ఆభరణాలు సైతం కొంటారు.
వ్యాపారాలలో లాభపడతారు.
కొత్త వ్యాపార సంస్థలు కూడా ప్రారంభిస్తారు.
భాగస్వామ్యాలలో ఒత్తిడులు తొలగుతాయి.
ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతనైనా తేలిగ్గా పూర్తి చేస్తారు.
మీ పనితీరుకు అధికారులు సైతం ఆశ్చర్యపడతారు.
వైద్యులు,పారిశ్రామికవేత్తలు, కళాకారులు ఇబ్బందికర పరిస్థితులను అధిగమిస్తారు.
టెక్నికల్ రంగం వారు అనుకోని మార్పులు జరిగి ఆశ్చర్యపడతారు.
మహిళలు సొంత ఆలోచనలతో ముందుకు సాగడం ఉత్తమం.
వీరు ముఖ్యంగా సోమ, మంగళ, శుక్ర, శనివారాలు మాత్రం ప్రయాణాలు చేస్తారు.
అయితే కొంత జాగ్రత్తపడాలి.
అలాగే, ఆరోగ్య సమస్యలు.
కావలసిన వారితో వివాదాలు. శ్రమ తప్పకపోవచ్చు.
దుర్గాదేవిని ఆరాధించండి.