తుల
కొత్త కార్యక్రమాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు.
ఆలోచనలను కచ్చితంగా అమలు చేస్తారు.
చిన్ననాటి మిత్రుల నుంచి కొన్ని ముఖ్య సమాచారాలు అందుతాయి.
కాంట్రాక్టులు కొన్ని దక్కే అవకాశం.
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి ఉత్సాహవంతంగా గడుపుతారు.
మీ గౌరవప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి.
విద్యార్థుల శ్రమ అనుకూలించి మంచి ఫలితాలు సాధిస్తారు.
ఆర్థికం.. అనూహ్యంగా రావలసిన సొమ్ము సమకూరుతుంది.
అలాగే, రుణ బాధలు తగ్గి ఊపిరిపీల్చుకుంటారు.
కొన్ని పొదుపు పథకాల్లో భాగస్వాములవుతారు.
కుటుంబంలో మీ బాధ్యతలు మరింతగా పెరుగుతాయి.
సోదరులతో కీలక విషయాలపై చర్చిస్తారు.
శుభకార్యాలకు తగిన ఏర్పాట్లు చేసుకుంటారు.
ఊహించని రీతిలో బంధువర్గం నుండి సైతం చేయూత అందుతుంది.
ఆస్తులు కొనుగోలు పై తర్జనబర్జనలు కొలిక్కివస్తాయి.
చివరికి అగ్రిమెంట్లు చేసుకుంటారు.
వాహనాలు, ఆభరణాలు కొంటారు.
వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు తథ్యం.
భాగస్వాములు కూడా మీకు సంపూర్ణంగా సహకరిస్తారు.
ఇతర ప్రాంతాలలోనూ వ్యాపారాలు విస్తరించే సూచనలు.
ఉద్యోగులు విధుల్లో ఆటంకాలు అధిగమిస్తారు.
ఉన్నత స్థానంలోకి వెళ్లేందుకు మార్గం ఏర్పడుతుంది.
క్రీడాకారులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు అందుతాయి.
టెక్నికల్ రంగం వారికి పట్టింది బంగారమే.
మహిళలకు ఉత్సాహవంతంగా గడిచిపోతుంది.
వీరికి ఆది, సోమ, మంగళ, బుధవారాలు మాత్రం కాస్త చికాకులు తప్పకపోవచ్చు.
సమస్యలు సైతం ఎదురై పరీక్షగా మారతాయి.
ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి.
వివిధ వర్గాలకు స్వల్ప ఇబ్బందులు ఎదురవుతాయి.
శ్రీ కామాక్షి స్తోత్రాలు పఠించండి.