ధనుస్సు
ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయడంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు.
ఆత్మవిశ్వాసం వీడకుండా దైర్యంగా అడుగులు వేయడం మంచిది.
ఎంత కష్టించినా ఫలితం కనిపించదు.
వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
ఆలయాలు సందర్శిస్తారు.
ఇతరులకు సాయం అందించే క్రమంలో కొన్ని ఇబ్బందులు పడతారు.
మీ ఆలోచనలు ఇతరులకు ఉపయోగపడతాయి.
ఎవరినీ నొప్పించకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లడం మంచిది.
సొమ్ము అందక అవసరాలకు ఇబ్బందులు రావచ్చు.
మరోవైపు రుణ దాతలు నుండి ఒత్తిడులు పెరుగుతాయి.
ఇదే సమయంలో కొంత సొమ్ము సైతం పోగొట్టుకునే అవకాశం ఉంది.
కుటుంబంలో మీ నిర్ణయాల పై కొంత అసంతృప్తి కనిపిస్తుంది.
బంధువులతో తగాదాలు ఏర్పడి మనోవేదనకు గురవుతారు.
ఎటుచూసినా సమస్యలే దర్శమిస్తూ సవాలుగా మారవచ్చు.
ఆస్తుల వివాదాలు కొనసాగుతూనే ఉంటాయి.
పరిష్కార చర్యలు ముందుకు సాగవు.
వాహనాలు కొనుగోలు కూడా వాయిదా వేస్తారు.
వ్యాపారాలలో అందిన కొద్దిపాటి లాభాలతోనే సరిపెట్టుకోవాలి.
భాగస్వాములు కూడా సమయానికి అందుబాటులోకి రాకపోవడంతో ఆందోళన చెందుతారు.
ఉద్యోగాలలో బాధ్యతలు మరింతగా పెరుగుతాయి.
కొన్ని పొరపాట్లు కారణంగా మాటపడాల్సిన సమయం.
రాజకీయవేత్తలు, క్రీడాకారులు, వైద్యులకు నిరాశే మిగులుతుంది.
టెక్నికల్‌రంగం వారు ఆచితూచి అడుగులు వేయడం మంచిది.
మహిళలకు మనస్సు ఆందోళనకరంగా ఉంటుంది.
అయితే మిగతా రోజుల కంటే సోమ, మంగళవారాలు అనుకూలిస్తాయి.
ఆర్థికంగా, కుటుంబపరంగా సానుకూలం. ఆరోగ్యం కుదుటపడుతుంది.
వివిధ వర్గాలకు ఊరట కలుగుతుంది.
హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.