కుంభం
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం.
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం.
ఆప్తులు, శ్రేయోభిలాషుల సహాయసహకారాలు అందుతాయి.
కాంట్రాక్టర్లకు అనుకూల సమయం.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
ఇంటి నిర్మాణాలు చేపడతారు.
పోటీ పరీక్షల్లో నిరుద్యోగులకు విజయం.
అప్రయత్నంగా సొమ్ము అందుతుంది.
రుణ దాతల ఒత్తిడులు తొలగుతాయి.
సంతానం నుంచి కీలక సమాచారం రాగలదు.
ఒకరి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి.
సోదరులు, సోదరీల నుంచి ఆహ్వానాలు అందుతాయి.
ఆస్తుల వ్యవహారాలలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
ఆరోగ్యం మరింత మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు.
వ్యాపారాలలో కొత్త భాగస్వాముల నుంచి పెట్టుబడులు అందుతాయి.
లాభాలు ఊరిస్తాయి.
ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కుతాయి.
మీకంటూ ప్రత్యేకత చాటుకుంటారు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులు అనుకున్నది సాధిస్తారు.
మహిళలు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
నృసింహ స్తోత్రాలు పఠించండి.