మేషం
కొత్త కార్యక్రమాలు చేపడతారు.
ఆత్మీయుల నుంచి కీలక సమాచారం.
విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.
నూతన వ్యక్తుల పరిచయం.
శుభకార్యాలకు హాజరవుతారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
క్లిష్ట సమస్యల నుంచి బయటపడతారు.
రావలసిన సొమ్ము అందుతుంది.
మీ అవసరాలు తీరతాయి.
అందరితోనూ సంతోషంగా గడుపుతారు.
సంతానపరంగా మరింత ఆనందదాయకంగా ఉంటుంది.
భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి.
వేడుకలకు మీ ఇల్లు వేదిక కాబోతోంది.
కొద్దిపాటి రుగ్మతలు తొలగుతాయి.
మెరుగైన జీవనం సాగిస్తారు.
వ్యాపారాలు గతం కంటే లాభసాటిగా ఉంటాయి.
పెట్టుబడులు సమకూరతాయి.
ఉద్యోగాలలో కోరుకున్న అవకాశాలు దక్కవచ్చు.
కొన్ని మార్పులు అదృష్టంగా మారవచ్చు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహం.
మహిళలకు ఆస్తి లాభం.
గణేశాష్టకం పఠించండి.