కర్కాటకం
కొత్త ఆలోచనలతో అనూహ్యమైన విజయాలు సాధిస్తారు.
అనుకున్న విధంగా కార్యక్రమాలు పూర్తి కాగలవు.
చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు తెలుసుకుంటారు.
ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. ఇందుకు ఒక వ్యక్తి సహాయపడతారు.
విద్యార్థులకు అనుకూల సమాచారం.
రావలసిన సొమ్ము అంది కొన్ని అవసరాలకు ఆదుకుంటుంది.
అలాగే, స్థిరాస్తులపై పెట్టుబడులకు కొంత కేటాయిస్తారు.
కుటుంబంలోని అందరి మన్ననలు, ఆదరణ పొందుతారు.
మీ మాటకు ఎదురులేనట్లుగా ఉంటుంది.
ఆస్తుల పంపకాలలో సోదరులు, సోదరీలతో వివాదాలను మీరే చొరవ తీసుకుని పరిష్కరిస్తారు.
ఆరోగ్యంపై కొంత దృష్టి పెట్టడం మంచిది.
వ్యాపారాలలో కొత్త పెట్టుబడులతో ముందుకు దూసుకువెళతారు.
తగినంత లాభాలు దక్కుతాయి.
ఉద్యోగాలలో మరింత గుర్తింపు లభిస్తుంది.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత గుర్తింపు లభిస్తుంది.
టెక్నికల్ రంగం వారికి మరింత కలిసివచ్చే కాలం అని చెప్పవచ్చు.
మహిళలకు మానసిక ఆందోళన తొలగుతుంది.
ఉద్యోగాలలో హఠాత్తుగా మార్పులు ఉండవచ్చు. అన్నింటికీ సిద్ధపడాలి.
పారిశ్రామికవేత్తలు, కళాకారులు కొన్ని అవకాశాలు తిరస్కరించడం మంచిది కాదు.
తొందరపాటు చర్యలు వద్దు.
హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
అలాగే, ఒక ఎర్రటి వస్త్రం దానం చేయండి.