మిథునం
ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది.
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
ప్రముఖులు పరిచయం కాగలరు.
ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది.
ఆస్తుల వివాదాలు పరిష్కారమవుతాయి.
గృహ, వాహన యోగాలు.
కుటుంబంలోని అందరితోనూ ప్రేమానురాగాలు పంచుకుంటారు.
రెండవ సంతాన విషయంలో శుభవార్తలు.
వివాహాది వేడుకలు నిర్వహిస్తారు.
ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు.
మీరు కోరుకున్న డబ్బు అందుతుంది.
కొంత నలత చేసినా వెంటనే ఉపశమనం లభిస్తుంది.
వ్యాపారాలలో లాభాలు అందుతాయి.
భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.
ఉద్యోగాలలో విశేష గుర్తింపు రాగలదు.
ప్రమోషన్లు దక్కుతాయి.
కళాకారులకు అవార్డులు దక్కుతాయి.
మహిళలకు తండ్రి తరఫు నుంచి ధన లాభం.
దుర్గాదేవిని పూజించండి.