సింహం
ముఖ్య కార్యక్రమాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి.
మిత్రులు మరింత చేయూతనందిస్తారు.
కాంట్రాక్టులు దక్కుతాయి.
చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.
వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
ఆలయాలు సందర్శిస్తారు.
డబ్బుకు లోటు ఉండదు.
రుణ బాధలు తొలగుతాయి.
ఆస్తుల వ్యవహారాల్లోనూ లబ్ధి చేకూరుతుంది.
భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.
సంతానపరంగా నెలకొన్న ఇబ్బందులు తీరతాయి.
బంధువుల సహాయం అందుతుంది.
సోదరీల నుంచి ఆహ్వానాలు అందుతాయి.
కొన్ని రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి.
పెట్టుబడులు అందుతాయి.
ఉద్యోగాలలో ప్రమోషన్లు రాగలవు.
విధి నిర్వహణలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.
రాజకీయవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు ఉంటాయి.
మహిళలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.
విష్ణు ధ్యానం చేయండి.