తుల
కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు.
దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది.
మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
ప్రముఖులు పరిచయమవుతారు.
పూర్వపు మిత్రుల నుంచి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు.
అప్రయత్నంగా సొమ్ము అందుకుంటారు.
రుణాలు తీరి ఊరట చెందుతారు.
కుటుంబంలో రెండవ సంతాన వివాహ విషయంలో తుది నిర్ణయాలు తీసుకుంటారు.
తండ్రి తరఫు వారితో తగాదాలు తీరతాయి.
సోదరులు, సోదరీలతో ఆనందంగా గడుపుతారు.
ఆరోగ్యం కొంత మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు.
వైద్య సేవలు విరమిస్తారు.
వ్యాపారాలలో కొత్త భాగస్వాములతో విస్తరిస్తారు.
పెట్టుబడులకు తగిన లాభాలు తథ్యం.
ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం.
ఉన్నతాధికారుల ఆదేశాల అమలులో విజయం సాధిస్తారు.
రాజకీయవేత్తలు, కళాకారులకు సత్కారాలు జరుగుతాయి.
మహిళలకు కుటుంబంలో విశేష గౌరవం.
ఆదిత్య హృదయం పఠించండి.