మీనం
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.
సంఘంలో గౌరవం పెరుగుతుంది.
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.
ప్రముఖులు పరిచయమవుతారు.
ప్రత్యర్థులు సైతం మీకు సహాయపడతారు.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
ఇంత కాలం పడిన ఇబ్బందులు తొలగుతాయి.
వద్దంటే డబ్బుగా ఉంటుంది. బాకీలు వసూలవుతాయి.
కుటుంబంలోని అందరితోనూ ప్రేమను పంచుకుంటారు.
సంతానం నుంచి మరింత సౌఖ్యం.
వారి అభివృద్ధికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తాయి.
కొద్దిపాటి నలత చేసినా ఉపశమనం పొందుతారు.
వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి.
విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి.
ఉద్యోగాలలో పై స్థాయి నుంచి ప్రశంసలు.
విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి.
రాజకీయవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం.
మహిళలకు సోదరుల ద్వారా ధన లబ్ధి.
విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.