ధనుస్సు
కొత్త పనులు చేపడతారు.
ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి.
ప్రత్యర్థులు అనుకూలురుగా మారి సహాయపడతారు.
భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
ఆలయాలు సందర్శిస్తారు.
ప్రముఖులు పరిచయం కాగలరు.
విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కుతాయి.
రావలసిన సొమ్ము అందుతుంది.
రుణ భారాలు తొలగుతాయి.
కుటుంబంలోని అందరి ప్రేమను పొందుతారు.
రెండవ సంతానం ఉద్యోగ యత్నాలు సానుకూలమై ఊరట చెందుతారు. బంధువుల ఇంట వేడుకలకు హాజరవుతారు.
కొద్దిపాటి రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి.
పెట్టుబడులు అందుకుంటారు.
ఉద్యోగాలలో కోరుకున్న ప్రమోషన్లు రాగలవు.
ఉన్నతాధికారుల ఆదరణ పొందుతారు.
రాజకీయవేత్తలకు పదవీయోగం. సన్మానాలు.
మహిళలకు యత్నకార్యసిద్ధి.
నవగ్రహ స్తోత్రాలు పఠించండి.