వృషభం
ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు.
మిత్రులతో అకారణంగా విరోధాలు.
తీర్థ యాత్రలు చేస్తారు.
ప్రత్యర్థులు సమస్యలు సృష్టిస్తారు.
నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి.
ఆలోచనలు స్థిరంగా ఉండవు.
ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి.
కొత్తగా రుణాలు చేస్తారు.
ఆస్తుల క్రయవిక్రయాలు కూడా అంతగా అనుకూలించవు.
కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు.
సోదరులు, సోదరీల నుంచి ఒత్తిడులు.
సంతానపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
తరచూ వైద్య సేవలు పొందుతారు.
వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు.
ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు.
బాధ్యతలు మరింత పెరుగుతాయి.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవకాశాలు చేజారవచ్చు.
మహిళలకు కుటుంబంలో ఒడిదుడుకులు.
లక్ష్మీ స్తుతి మంచిది.