కన్య
కొత్త పనులు చేపడతారు.
స్నేహితులు మీకు వెన్నంటే ఉంటారు.
కాంట్రాక్టులు సైతం దక్కుతాయి.
విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి.
తీర్థ యాత్రలు చేస్తారు. వాహన, గృహయోగాలు.
నిరుద్యోగులకు ఉద్యోగ లాభం.
కుటుంబ సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది.
భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి.
ప్రథమ సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి.
ఆర్థికం ఇబ్బందులు నెలకొన్నా అవసరాలకు లోటు ఉండదు.
ఏదో విధంగా డబ్బు సమకూర్చుకుంటారు.
కొద్దిపాటి రుగ్మతలు తప్పకపోవచ్చు.
వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి.
నూతన భాగస్వాములు చేరతారు.
ఉద్యోగాలలో ఊహించని మార్పులు సంభవం.
పారిశ్రామికవేత్తలు సంస్థల విస్తృతిలో విజయం సాధిస్తారు.
మహిళలకు మానసిక ప్రశాంతత.
గణేశాష్టకం పఠించండి.